రైల్వే బోగీలపై పేపర్ చార్ట్ లకు స్వస్తి… - MicTv.in - Telugu News
mictv telugu

రైల్వే బోగీలపై పేపర్ చార్ట్ లకు స్వస్తి…

February 17, 2018

రిజర్వేషన్ చార్టులపై కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే రిజర్వేషన్ కు సంబంధించిన చార్టును ఇకనుంచి కోచ్‌లపై  అతికించడాన్ని నిలిపివేయనుంది. మార్చి 1 నుంచి ఈ పద్దతి అమలులోకి రానుందని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటిచింది. ఇప్పటికే  న్యూఢిల్లీ, ముంబయ్ సెంట్రల్, చెన్నై సెంట్రల్ రైల్వే, సీల్దా స్టేషన్‌లో గత మూడు నెలలుగా ఈ విధానం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. దీనిని ఏ1, ఏ రైల్వేస్టేషన్‌లలో ఫైలెట్ ప్రాజెక్టుగా ఆరు నెలలపాటు చేపట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద నెట్ వర్క్ అయిన భారతీయ రైల్వే పేపర్ కోసం అనవసరంగా ఖర్చు అవుతున్న డబ్బును ఆదా చేయడానికి ఈ పద్దతిని అమలు చేయనుంది. ఈ పద్దతిని అన్ని రైల్వేలలో ఆరు నెలల పాటుగా పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.తాజా నిర్ణయంతో రిజర్వేషన్ చార్ట్‌లకు బదులుగా డిజిటల్ బోర్డులను రైల్వేస్టేషన్‌లో మెరుగు పరిచి ఏర్పాటు చేయనున్నట్లు  రైల్వే శాఖ తెలిపింది.

 డిజిటలైజేషన్‌లో భాగంగా ఇ-టికెటింగ్  విధానాన్ని అమలు చేయనున్నట్లు అధి​కారులు వెల్లడించారు. కాగిత రహిత కార్యకలాపాలను  ప్రోత్సహించాలనే ఆలోచనతోనే ఈ  నిర్ణయం తీసుకున్నామని రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. దాంతో  సంవత్సరానికి 28టన్నుల పేపర్‌ను ఆదా చేయడంతో పాటు రూ.1.70లక్షల  ఖర్చును ఆదా  అవుతోంది.  ప్రయాణీకుల నుంచి వచ్చే ఆదాయం ఆధారంగా, రైల్వేలు దాని స్టేషన్లను ఏ, ఏ1, బీ,సీ,డీ, ఈ, ఎఫ్‌  మొత్తం 7 కేటగిరీలుగా  , 17 జోన్లుగా విభజించింది..