ఒకే వేదికపై సచిన్, ప్రియా ప్రకాశ్ వారియర్... - MicTv.in - Telugu News
mictv telugu

ఒకే వేదికపై సచిన్, ప్రియా ప్రకాశ్ వారియర్…

February 24, 2018

క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ,  సోషల్ మీడియా స్టార్ ప్రియా వారియర్ ఒకే వేదికపై ఫుట్‌బాల్  ప్రేక్షకులను  కనువిందు చేశారు. ఇండియన్ సూపర్ లీగ్‌లో భాగంగా కొచ్చిలో  శుక్రవారం కేరళ బ్లాస్టర్స్ ,చెన్నియన్ ఎఫ్‌సీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. కేరళ బ్లాస్టర్‌కు సచిన్ ఓనర్‌గా  వ్యవహరిస్తున్నాడు. అందుకే సచిన్ మ్యాచ్‌కు హాజరయ్యాడు.అంతేకాకుండా ఈ మ్యాచ్‌ను మళయాళ నటుడు జయసూర్య కూడా తిలకించాడు. మ్యాచ్‌కు వచ్చిన ప్రముఖులందరూ పసుపు రంగు దుస్తుల్లో దర్శనమివ్వటం విశేషం.