టబు చంపమని చెబితే చంపాడంట.. - MicTv.in - Telugu News
mictv telugu

టబు చంపమని చెబితే చంపాడంట..

April 5, 2018

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణజింకలను వేటాడి చంపిన కేసుకులో జోధ్‌పూర్ హైకోర్టు ఐదేళ్ల జైలు శిక్షతోపాటుగా రూ.10వేల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.ఈ కేసు విచారణలో  ఓ ప్రత్యక్ష సాక్షి న్యాయస్థానంలో ఓ విషయాన్ని చెప్పారు. 1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా చిత్రికరణ సమయంలోన సల్మాన్ కృష్ణజింకలను వేటాడేప్పుడు ఆయనతోపాటు సైఫ్ అలీ ఖాన్ , సోనాలి బింద్రే, టబు, నీలం ఉన్నారు. జీపులో సల్మాన్ పక్కనే ఉన్న టబు.. జింకను కాల్చాలని  సల్మాన్‌ను రెచ్చగొట్టిందని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఈ కేసులో సల్మాన్‌‌కు మాత్రమే శిక్ష పడి, మిగతవారిని న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటిచింది. సల్మాన్ తరుపున న్యాయవాది కోర్టులో బెయిల్ దరఖాస్తు చేశారు. దానిపై రేపు కోర్టులో తీర్పు వెలువడనుంది.