సింగరేణి బొగ్గుగనుల సంస్థ తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. ఇటీవల జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్.. సంస్థ ఉద్యోగులకు హామీ ఇవ్వడం తెలిసిందే. ఆ హామీలకు సంగరేణి సంస్థ ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో వీటికి ఆమోదం తెలిపారు. ఆమోదం పొందిన నిర్ణయాలపై తక్షణమే అమలు చేస్తామని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు.
- సింగరేణి ఉద్యోగుల మెడికల్ అన్ఫిట్ కేసులకు నూ. 25 లక్షలు ఒకేసారి చెల్లింపు
2.మెడికల్ అన్ఫిట్ కేసులో ఉద్యోగం వద్దకునే వారికి రూ. 25 లక్షల మెుత్తం ఒకేసారి చెల్లింపు, లేదా నెలవారి భృతి కావాలకుంటే నెలకు 25 వేలు చెల్లింపు.
- ఏప్రిల్ 14.. అంబేడ్కర్ జయంతి సందర్బంగా జీతంలో కూడిన సెలవుగా ప్రకటన
- ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ రిఫరల్ వైద్యం
- ఉద్యోగినులకు రెండు ఏళ్ల చైల్డ్ కేర్ సెలవులు
- మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్మిస్తున్నఎస్టీపీసి 800మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం పనులు బీహెచ్ఈఎల్కు అప్పగించేందుకు అంగీకారం
- నిర్మాణ వ్యయం రూ. 5,817 కోట్లకు బోర్డు ఆమోదం