27 ఏళ్ల తర్వాత యుగళ గీతం.. - MicTv.in - Telugu News
mictv telugu

27 ఏళ్ల తర్వాత యుగళ గీతం..

February 7, 2018

దక్షిణాది సంగీతానికి రెండు కళ్లలాంటి వారు ఎస్పీ బాలసుబ్రమణ్యం, కే.జే యేసుదాసు,. ఒక్కొక్కరిది ఒక్కో విశిష్టత.  ఇద్దరూ 1991లో వచ్చిన ‘దళపతి’ చిత్రంలో ‘సింగారాలా’ పాటను ఆలపించారు. ఆ పాట ఇప్పటికీ అభిమాల మదిలో మెదులుతూనే ఉంటుంది. ఆ తర్వాత వారు ఇద్దరు కలసికట్టుగా మరే పాటా పాడలేదు. దాదాపు 27 ఏళ్ల ఈ గ్యాప్ ను భర్తీ చేస్తూ తాజాగా  ఓ పాట పాడి అభిమానులను అలరించారు. 
మలయాళం,తమిళ బాషల్లో తెరకెక్కితున్న ‘కినార్ -కెని’ సినిమా కోసం ‘అయ్య సామి’ అనే పాటను బాలు, యేసుదాసు పాడారు. కేరళ ,తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో నీటి సమస్య నేపథ్యంగా దర్శకుడు నిషద్ ఈ చిత్రాని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో  అలనాటి నటులు జయప్రద, రేవతి నటిస్తున్నారు. బాలు ,యేసుదాసు పాడిన పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో కేరళ,తమిళనాడు రాష్ట్రాల అందాలను,సంస్కృతిని చక్కగా చూపించారు. అంతేకాక పాటలో పచ్చని పొలంలో తమిళ సూపర్ స్టార్లు కమల్ హాసన్, రజనీకాంత్ బొమ్ములు వేసి వాటి చుట్టు కళాకారులు నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.