రామానాయుడు స్టూడియోలో వందల అమ్మాయిల మానాలు నలిగిపోతున్నాయి.. - MicTv.in - Telugu News
mictv telugu

రామానాయుడు స్టూడియోలో వందల అమ్మాయిల మానాలు నలిగిపోతున్నాయి..

April 14, 2018

గత కొద్ది రోజులుగా నటి శ్రీరెడ్డి  సినీ రంగంలో ‘కాస్టింగ్ కౌచ్ ’ ద్వారా చాలా మంది అమ్మాయిల జీవితాలను సినీ పరిశ్రమలోని కొందరు వ్యక్తులు నాశం చేశారని ఉద్యమం చేస్తున్న సంగతి తెసిందే. తనను  ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు కొడుకు అభిరామ్ సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనను వాడుకుని మోసం చేశాడని ఆరోపణలు చేసింది. అయితే తాజాగా అభిరామ్ లాంటి వ్యక్తులను నిర్భయ చట్టం కింద అరెస్టు చేయాలని తన ఫేస్‌బుక్‌లో శ్రీరెడ్డి పోస్ట్ పెట్టింది.‘రామానాయుడు స్టూడియోలో వందల మంది ఆడపిల్లల మానాలు నలిగిపోతున్నాయి. తక్షణం ఆ స్టూడియో నుంచి అమ్మాయిలకు విముక్తి కలిగించాలి. అమ్మాయిల ఫీలింగ్స్‌తో ఆడుకునే ఎవడినీ వదిలేది లేదు. ఇక ముందు ఏ అమ్మాయి జీవితంతో ఆడుకోవాలన్నా భయపడాలి. నేను చేస్తున్న ఉద్యమానికి మరకలు అంటించేవాళ్లకి ఇదే నా సవాల్’ అని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఓ టీవీ ఛానల్లో సైతం రామానాయుడు స్టూడియో గురించి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. స్టూడియోలు కేవలం అమ్మాయిలను నలిపెయ్యటానికే కట్టుకున్నారని చెప్పింది. అభిరామ్ నాకు ఇష్టం లేకుండా నాతో ఫోెర్స్‌డ్ సెక్స్ చేశాడని పచ్చిగా చెప్పింది. జంతువులా తనను లైంగికంగా వేధించాడని పేర్కొంది.

Vandala mandi aadapillala manalu naligina ramanayudu studios ki thakshanam valla nunchi vimukthi kaliginchalani,abhiram…

Posted by Sri Reddy on Friday, 13 April 2018