రవిశంకర్‌ను అరెస్టు చేయాలి: ఒవైసీ - MicTv.in - Telugu News
mictv telugu

రవిశంకర్‌ను అరెస్టు చేయాలి: ఒవైసీ

March 6, 2018

ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌పై ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.రామ మందిరం నిర్మాణం జరగకపోతే భారత్ మరో సిరియా అవుతుందని  రవిశంకర్ ఓ ఇంటర్వ్యూలో హెచ్చరించడంపై ఒవైసీ ఘాటుగా స్పందించారు. విద్వేషాలను రెచ్చగొడుతున్న ఆయనపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

రవిశంకర్‌కు రాజ్యాంగంపై నమ్మకం లేదు. అలాంటప్పుడు చట్టాన్ని ఎలా నమ్ముతారు? ఆయనకు ఆయనే చట్టంగా ఫీలయిపోతున్నారు. ఆయన చెప్పిందే అందరూ వినాలని కోరుకుంటున్నారు. ఆయన మధ్యవర్తిలా అనిపించటం లేదు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి అల్లర్లకు పురిగొల్పాలని చూస్తున్నారు’ అని ఒవైసీ విమర్శించారు.అయోధ్య వివాదాస్పద స్థల వివాదం కేసులో  2019 లోక్‌సభ ఎన్నికల కంటే ముందే తీర్పు ఇవ్వాల్సిందిగా ఒవైసీ అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.