శ్రీదేవి కోసం ఏడ్చేసి, జ్వరం తెచ్చుకున్న కంగన - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవి కోసం ఏడ్చేసి, జ్వరం తెచ్చుకున్న కంగన

February 27, 2018

అతిలోక సుందరి శ్రీదేవి మరణవార్త‌ను అభిమానులు, ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరణ వార్త విన్నప్పటి నుంచి బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కన్నీరుమున్నీరు అవుతున్నారు. దాంతో ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది.శ్రీదేవి అమితంగా ఇష్టపడే కంగనా ఎవరితో మాట్లాడానికి ఇష్టపడడం లేదని ఆమె సన్నిహితులు చెప్పారు. కంగనా చాలా సందర్బాల్లో తాను చిన్నప్పటి నుంచి శ్రీదేవి డ్యాన్స్ చూసి డ్యాన్స్ నేర్చుకున్నట్లు తెలిపింది. కంగనా ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘మణికర్ణిక’  చిత్రంలో నటిస్తోంది. కంగనా అనారోగ్యం కారణంగా ఈ సినిమా  చిత్రికరణను చిత్ర యూనిట్ వాయిదా వేశారు.