mictv telugu

డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్‌కు గాడిద పోటీ

April 28, 2018

ఇక నుంచి ఎవరినీ.. పోరా గాడిదా అని తిట్టకండి. ఎందుకంటే గాడిద జాతి తెగ బాధపడుతుంది. డిప్యూటీ తహసీల్దార్ పరీక్షకు ఒక గాడిద పోటీ పడుతోంది..! ఏంటి.. ఆశ్చర్యపోతున్నారా? జమ్మూ కశ్మీర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు(ఎస్ఎస్బీ) గాడిదకు గొప్ప గౌరవాన్ని ఇచ్చింది. డిప్యూటీ తహసీల్దార్‌ పరీక్షలో పోటీ పడేందుకు గాడిదకు హాల్‌ టికెట్‌ జారీ చేసింది.అభ్యర్థి పేరు ‘కచౌర్‌ ఖర్‌’ (గోధుమ రంగు గాడిద) అంటూ, హాల్‌ టికెట్‌పై గాడిద ఫోటోనే కూడా ముద్రించి పడేసింది.

ఈ హాల్ టికెట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు సదరు బోర్డుపై జోకుల వర్షం కురిపిస్తున్నారు. ‘అడ్డగాడిదలు పోటీ పరీక్షలు నిర్వహిస్తే ఇలాగే ఉంటుంది. వేలకు వేలు జీతాలు మేస్తూ మరిన్ని గాడిదలకు చక్కని అవకాశాలు కల్పిస్తున్నారు..’ అని ఒక నెటిజన్ కామెంటాడు. కొందరైతే.. బోర్డు ఏదో తప్పు చేస్తే అది కాస్తా వైరల్ కావడం మరో దరిద్రం అని అని అసహనం వ్యక్తం చేశాడు.