నా కొడుక్కి సాయం చేయండి... - MicTv.in - Telugu News
mictv telugu

నా కొడుక్కి సాయం చేయండి…

August 28, 2017

హీరోయిన్ సుహసిని, దర్శకుడు మణిరత్నంల కొడుకు నందన్ ఇటలీలో దోపిడికి గుర్యయాడు.  అతడు బెలున్నో వెళ్తుండగా దోపిడీ దొంగలు దారికాచి దోచుకుననారు.  సుహాసిని స్వయంగా ఈ వివరాలను ట్వీట్ చేశారు. ‘వెనిస్ లో మనవాళ్లెవరైనా ఉంటే నందన్ కు సాయం చేయండి. అతుడు ఎయిర్ పోర్టు చేరుకోవడానికి సహకరించండి..  

అయితే అతని  ఫోన్ నంబర్ కు ఎవరూ  దయచేసి ఫోన్ చేయకండి. ఎందుకంటే అతని ఫోన్ లో బ్యాటరీ తక్కువగా ఉంది. అతనితో మేము కాంటాక్ట్ ను కోల్పోయే అవకాశం ఉంది.. ’ ట్వీటర్ ద్వారా సుహసిని తెలిపింది. ప్రస్తుతం  నందన్ క్షేమంగానే ఉన్నాడని, ఓ హోటల్ దిగాడని తెలిసింది. తన కొడుకు సహాయం చేసినవారికి దన్యావాదలు అని సుహాసిని తెలిపారు.