‘జై లవకుశ’లో మిల్క్ బ్యూటీ స్పెషల్ సాంగ్ - MicTv.in - Telugu News
mictv telugu

‘జై లవకుశ’లో మిల్క్ బ్యూటీ స్పెషల్ సాంగ్

August 28, 2017

‘జై లవకుశ’ మూవీలోఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా  టీజర్లకు మంచి స్పందన వచ్చింది. దీంతో మూవీపై భారీ హైప్స్ పెరిగాయి. ఈ మూవీలో రాశీ ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్ల గా నటిస్తున్నారు.ఈ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేసే పనిలో ఉన్నారు మూవీ యూనిట్.

‘జనతా గ్యారేజ్’ లో కాజల్ చేసిన  స్పెషల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో జై లవకుశ మూవీలో కూడా ఓ స్టార్ హీరోయిన్ చేత స్పెషల్ చేయించాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యారట. డిఫరెంట్ కాన్సెఫ్ట్ తో తెరకెక్కుతున్న సాంగ్ కోసం ఎన్టీఆర్ ఎనర్జీకి దీటుగా చేయగలిగే మిల్క్ బ్యూటీ తమన్నాను ఫైనల్ చేశారని  టాక్. తమన్నా ఇప్పటికే అల్లుడు శీను, స్పీడున్నోడు మూవీలలో స్పెషల్ సాంగ్ తో ఆలరించింది. మరోసారి ఎలా ఆలరిస్తుందో చూడాలి.