ఇళయ దళపతికి అరుదైన గౌరవం - MicTv.in - Telugu News
mictv telugu

ఇళయ దళపతికి అరుదైన గౌరవం

December 15, 2017

ఇళయ దళపతి అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే తమిళ హీరో విజయ్‌కి  అరుదైన గౌరవం దక్కింది. ఆయన ఫోటో సీబీఎస్ఈ  సిలబస్ పాఠ్యపుస్తకంలో చోటుచేసుకుంది. ఒక నటుడి ఫోటో ఇలా పాఠ్యపుస్తకంలో చోటుచేసుకోవండం చాలా అరుదైన విషయం.ఈ మధ్య విజయ్ నటించిన చిత్రం మెర్సల్‌లో వైద్యుడిగా నటించిన సంగతి తెలిసిందే. ఆయన ఉత్తమ సేవలకుగానూ విదేశంలో అవార్డు ప్రధానం చేసే కార్యక్రమం జరుగతుంది. ఆ కార్యక్రమానికి విజయ్ తమిళ సంప్రదాయ దుస్తులు, చొక్కా, ధోవతి కట్టుకుని వెళ్తారు. అయితే అక్కడ అతని వేషధారణ చూసిన సెక్యూరిటీ అనుమానం వచ్చి సోదాలు చేస్తారు. ఆ తరువాత ఆయన ప్రముఖ డాక్టర్ అని తెలుసుకుని క్షమాపణ చెప్పి గౌరవిస్తారు. ఈ సన్నివేశంలో తమిళ సంప్రదాయాన్ని గౌరవాన్ని చాటి చెప్పే విజయ్ ఫోటోను మూడవ తరగతి  సీబీఎస్ఈ  పాఠ్యపుస్తకంలో పొందుపరిచారు. తమిళుల ఘనత,సంస్కృతి ,సంప్రదాయాలను చాటి చెప్పడంతో విజయ్ పాఠ్యపుస్తకంలో ఎక్కారు. ఈ విషయం తెలుసుకున్న విజయ్ అభిమానులు చాలా ఆనందంలో మునిగిపోతున్నారు.