భార్యను జైలు నుంచి విడిపించబోయి జైలు పాలయ్యాడు... - MicTv.in - Telugu News
mictv telugu

భార్యను జైలు నుంచి విడిపించబోయి జైలు పాలయ్యాడు…

March 7, 2018

భార్యను జైలు నుంచి విడిపించడానికి , డబ్బుల కోసం దొంగతనం చేసిన భర్తతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మనోహరాబాద్ దండుపల్లి పిట్టవాడకు చెందిన  జయేంద్రరావు తన భార్యను జైలు నుంచి విడిపించడానికి డబ్బులు లేక చోరీకి ఒడిగట్టాడు. తన దూరపు బంధువులైన పార్థీ గోపాల్(72) విజయ్‌లతో కలసి సర్వసతి నగర్‌లోని మాజీ ఆర్మీ ఉద్యోగి ఇంటికి కన్నం వేశారు. ఎల్ఈడీ టీవీ , రెండు తులాల బంగారు గాజులు దొంగలించారు. అంతటితో ఆగకుండా మరొకరి ఇంట్లో 10 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. సోమవారం రాత్రి సర్వసతి నగర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న  ముగ్గురు వ్యక్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిజాలు బయట్టపడ్డాయి.జయేంద్రరావు  భార్య కూతురును చంపి జైలుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో భార్యను జైలు నుంచి విడిపించడానికే  డబ్బు కోసం దొంగనాలకు పాల్పిడినట్టు నేరం అంగీకరించాడు. దొంగలించిన బంగారు నగలను గుర్తు తెలియని లారీడ్రైవర్‌కు రూ. 20 వేలకు అమ్మినట్టు తెలిపాడు. రూ. 10 వేలు భార్యను విడిపించడానికి లాయర్‌కు ఫీజు కింద ఇచ్చినట్టు తెలిపాడు.  తిరుమలగిరి పోలీసులు వారి వద్ద నుంచి ఎల్ఈడీ టీవీని స్వాధీనం చేసుకున్నారు.