సెన్సార్  స్క్రీన్లు.. రోడ్డు మరణాలను అడ్డుకుంటాయి.. - MicTv.in - Telugu News
mictv telugu

సెన్సార్  స్క్రీన్లు.. రోడ్డు మరణాలను అడ్డుకుంటాయి..

February 17, 2018

ట్రాఫిక్ కూడళ్లలో సిగ్నల్ లైట్లు పడినప్పుడు ఒక్కోసారి వాహనదారులు తొందరపాటులో, ఏమరుపాటులో పట్టించుకోకుండా దూసుకుపోతుంటారు. మరోపక్క.. పాదచారులు జీబ్రా క్రాస్‌లలో కాకుండా వేగంగా వస్తున్న వాహనాల మధ్య దూరుతూ రోడ్డు దాటుతుంటారు. దీంతో విలువైన ప్రాణాలు గాలిలో కలసిపోతుంటాయి. అయితే ఆధునిక టెక్నాలజీతో ఇలాంటి రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సెన్సార్ స్క్రీన్ల ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టొచ్చని అంటున్నారు.

ఈ విధానంలో అసలు భౌతికంగా ఎలాంటి తెరలూ ఉండవు. లేజర్ కిరణాలతో తెరల్లా వెలుగు వస్తుంది. దానిపై టైమ్ కనిపిస్తుంది. ఆ తెరలు రోడ్డుకు సమాంతరంగా కనిపించినప్పుడు పాదచారులు రోడ్డు దాటకూడదు. ఆ సమయంలో వాహనాలు ఫ్రీగా వెళ్లిపోతుంటాయి. వాటిని దాటి ఎవరైనా రోడ్డు దాటాలని ప్రయత్నిస్తే  వెంటనే అలారం మోగుతోంది.

దాంతో వెంటనే ట్రాఫిక్ సిబ్బందికి సమాచారం వెళ్తుంది. లేజర్ కిరణాల తెరలు సమాంతరంగా కాకుండా రోడ్డుకు అడ్డంగా పడినప్పుడు  వాహనాలు ఎక్కడిక్కడే ఆగిపోతాయి. ఆ సమయంలో పాదచారులు రోడ్డును దాటేయచ్చు. ఈ ప్రయోగాన్ని మొదట ఉ్కరెయిన్ లోని చెర్నిహివ్ నగరంలో ప్రారభించారు.ఫలితాన్ని చూసిన తర్వాత వివిధ దేశాలలో కూడా ప్రారంభించాలని యూ- కోరీచన్ సంస్థ  ఉంది.