ప్రపంచంలో తొలిసారి ఓ ట్రాన్స్ జెండర్ మహిళ(30) బిడ్డకు పాలిచ్చింది. వినడానికి విడ్డూరంగా ఉన్నా మాత్రం ఇది నిజం. అమెరికాలోని ఇద్దరు ఆడవాళ్లలో ఒకరు కలిసి జీవించాలనుకున్నారు. వారిలో ఒకరు ట్రాన్స్ జెండర్‌గా మారారు. అయితే ఆధునిక పద్దతుల ద్వారా మరో మహిళ గర్భం దాల్చింది. కానీ ఆమెకు పుట్టబోయే బిడ్డకు పాలివ్వడానికి ఇష్టం లేదు. దీనితో ట్రాన్స్ జెండర్ గా మారిన మహిళ తనే పుట్టిన బిడ్డకు పాలివ్వాలనుకుంది.
అమెరికాలో ఉన్న మౌంట్ సినాయ్‌లోని సెంటర్ ఫర్ ట్రాన్స్‌జెండర్ మెడిసన్ అండ్ సర్జీరీలోని వైద్యులను ఆమె సంప్రదించింది. భాగస్వామి 5 నెలల గర్భవతిగా ఉన్నప్పటి నుంచే ఈ ట్రాన్స్ జెండర్‌కు హార్మోన్ రీప్లేస్ మెంట్ థెరపీ చేశారు. బిడ్డ పుట్టే సమయానికి ఆ ట్రాన్స్ జెండర్‌లో చనుబాల వృద్ది కనిపించింది. చివరకు ఆమె ఎలాంటి లింగ మార్పిడి ఆపరేషన్లు లేకుండానే తన బిడ్డకు పాలిచ్చింది.
ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు చేసే వైద్యం ,ముందులకు సంబంధించి ఇది చాలా పెద్ద పురోగతి అని ఆమెకు వైద్యం చేసిన వైద్యుడు టామర్ రీస్మాన్ తెలిపాడు. ఆమె కేసును ట్రాన్స్ జెండర్ హెల్త్ అనే జర్నల్ లో పబ్లిష్ చేశారు. ‘డూ ఇట్ యువర్సెల్ఫ్ హార్మోన్ థెరపీ’ ద్వారా ట్రాన్స్‌జెండర్ మహిళలు గర్భం దాల్చొచ్చు.. బిడ్డకు జన్మనివ్వొచ్చని డాక్టర్లు స్పష్టం చేశారు.