తాజ్‌మహల్‌లోని ఓ మినార్ కూలింది... - MicTv.in - Telugu News
mictv telugu

తాజ్‌మహల్‌లోని ఓ మినార్ కూలింది…

April 12, 2018

ప్రముఖ పర్యాటక క్షేత్రం తాజ్‌మహల్‌లోని ఓ మినార్ కుప్పకూలింది. నిన్న రాత్రి ఆగ్రాలో కురిసిన భారీ వర్షానికి తాజ్ మహల్ ప్రవేశ ద్వారానికి ఉన్న 12 అడుగుల లోహపు పిల్లర్( దీన్ని దర్వాజా-ఏ-రౌజాగా పిలుస్తారు) కూలిందని అధికారులు తెలిపారు. దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో గాలి వీచడంతో మినార్ కూలిందని, తాజ్ మహల్ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఏఎస్ఐ (ఆర్కియోలాజికల్ సొసైట్ ఆఫ్ ఇండియా) వెల్లడించింది. మినార్‌పైన అమర్చిన కలశం సహా అన్ని ముఖ్యమైన భాగాలనూ భద్రపరిచినట్టు తెలిపారు.ఇదిలావుండగా తాజ్ మహల్‌పై హక్కులు తమవేనని, మొఘల్ చక్రవర్తి షాజహాన్ తమకు రాసిచ్చాడని వక్ఫ్ బోర్డు కోర్టుకు ఎక్కగా, షాజహాన్ సంతకం చేసిన డాక్యుమెంట్లను సాక్ష్యంగా ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.