వివో 'వై 69 ' విడుదల… - MicTv.in - Telugu News
mictv telugu

వివో ‘వై 69 ‘ విడుదల…

August 28, 2017

ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ వివో ‘వై 69’ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. దీని  ధర రూ. 14,909.. సెప్టెంబర్ 1 నుంచి ఇ-కామర్స్ సైట్లు అమోజాన్, ఫ్లిప్కార్ట్ తో పాటు ఇతర రిటైల్ స్టోర్లలో ” షాంపైన్ గోల్డ్,” మరియు “మ్యాట్ బ్లాక్ ” రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది.

గ్రూప్ సెల్పీ మోడ్ దీని ప్రత్యేకత కంపెనీ చెబుతోంది. ఎఫర్టబుల్ ధర, ఫ్రీమియర్ డిజైన్, సుపీరియర్ కెమెరాతో లాంచ్ చేసిన తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ తమ కస్టమర్లకు మంచి అనుభూతిని ఇస్తుందని నమ్మతున్నాను అని వివో ఇండియా సీఎంవో కన్నే జెంగ్ పెర్కొన్నారు.

వివో’ వై 69 ‘ఫీచర్లు…

5.5 అంగుళాల హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే, 1280×720 పిక్సెల్స్ రిజల్యూషన్.

3 కార్నింగ్ గొరిల్లా గ్లాస్1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియా టెక్ MT6750 ప్రాసెసర్.

ఆండ్రాయిడ్7.0 ఆపరేటింగ్ సిస్టమ్ 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్.

256జీబీ వరకు విస్తరించుకోనే సదుపాయం.

13ఎంపీ రియల్ కెమెరా, 16ఎంపీ మూన్ లైట్ సెల్ఫీ కెమెరా విత్ f/2.0, 3,000ఎంఏహెచ్ బ్యాటరీ.