అమ్రపాలి మరో సాహసం

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి మళ్లీ ట్రెక్కింగ్‌కు వెళ్లారు.  వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం ఇనుపరాతి గుట్టలపై అటవీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ట్రెక్కింగ్‌‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమ్రపాలి మాట్లాడుతూ…. తనకు ట్రెక్కింగ్ అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. ఇనుపరాతి గుట్ట ట్రెక్కింగ్ అనువైనదని , ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ ప్రాంతాన్ని సందర్శకులు వచ్చే విధంగా ఈ ప్రాంతాని తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ ట్రెక్కింగ్ లో నిట్, కాకతీయ యూనివర్సిటీ ఫిజిక  ల్ ఎడ్యుకేషన్ విభాగం విద్యార్థులు, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

SHARE