పెళ్లిలో డ్యాన్స్ చేసిందని భార్యను చంపేశాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లిలో డ్యాన్స్ చేసిందని భార్యను చంపేశాడు..

March 19, 2018

పెళ్లి వేడుకల్లో భార్య డ్యాన్స్ చేసిందనే కోపంతో  ఓ భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో జరిగింది. బసంతి ప్రాంతానికి చెందిన స్వప్న అనే యువతికి సుబీర్ నష్కర్  అనే వ్యక్తితో ఇటీవలే పెళ్లి జరిగింది. శనివారం వీరు తమ బంధువుల ఇంట్లో జరిగిన పెళ్లి వెళ్లారు. అక్కడ స్వప్న కొంత మంది యువకులతో కలిసి డ్యాన్స్ చేసింది. అది నచ్చని  సుబీర్ ఆమెతో అందరి ముందే గొడవ పెట్టుకుంటున్నాడు. స్వప్న భర్తపై అలిగి ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత సుబీర్ తన తల్లితో కలసి ఇంటికి వెళ్లాడు. ఆగ్రహం పట్టలేక తన తల్లితో కలసి స్వప్న గొంతు నులిమి చంపేశాడు.తన భార్య ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయినట్లు అందరినీ నమ్మించేందుకు ప్రయత్నించాడు. స్వప్న తల్లిదండ్రులు మాత్రం సుబీరే తమ కూతురిని హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లియినప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధించాడని ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుబీర్‌ను తమదైన శైలిలో విచారించారు. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు సుబీర్‌తో పాటు అతని తల్లిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. .