వాట్సాప్‌లో డిలీట్ చేసిన ఫైల్స్‌ను మళ్లీ పొందవచ్చు… - MicTv.in - Telugu News
mictv telugu

వాట్సాప్‌లో డిలీట్ చేసిన ఫైల్స్‌ను మళ్లీ పొందవచ్చు…

April 16, 2018

ప్రముఖ సోషల్ మాధ్యమం వాట్సాప్ తన యూజర్లకు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. వాట్సాప్‌లో యూజర్లు డిలీట్ చేసిన ఫోటోలు, వీడియోలు, జిప్ ఇమేజ్‌లు ,డ్యాక్యుమెంట్లు తదితర ఫైల్స్ మళ్లీ తిరిగి పొందేందుకు వీలు కల్పించనుంది.దీంతో యూజర్ తాను డిలీట్ చేసిన ఏ ఫైల్‌నైనా ఇకపై వాట్సాప్‌లో మళ్లీ పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతానికి కేవలం ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా వెర్షన్‌ను వాడుతున్న యూజర్లకే అందుబాటులోకి వచ్చింది. త్వరలో యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.