వాట్సాప్‌‌లో మరో కొత్త ఫీచర్... - MicTv.in - Telugu News
mictv telugu

వాట్సాప్‌‌లో మరో కొత్త ఫీచర్…

April 4, 2018

వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇప్పటికే కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ మరో సౌకర్యాన్ని తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ,యాపిల్ యూజర్లు అప్ డేటెడ్ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాపిల్ యూజర్లు అయితే స్టేటస్ అప్‌డేట్స్‌ను కొత్త పద్దతిలో చూడొచ్చు. వాయిస్ మెసేజ్‌లను మరింత సులువుగా ప్లే చేసుకోవచ్చు. ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసినా కూడా మరొక ఆప్‌లోకి మారినా కూడా వాయిస్ మెసేజ్ ప్లే అవుతూనే ఉంటుంది.ఐఓఎస్‌ 7.0, ఆ తర్వాతి వెర్షన్లతో మాత్రమే ఈ ఆప్షన్‌ పని చేస్తుంది. ఇప్పటికే ఉన్న ‘ఛేంజ్‌ నెంబర్‌’ ఆప్షన్‌కి మరిన్ని ఆప్షన్స్‌ని జత చేసింది. దీంతో కొత్త ఫోన్‌ నెంబర్‌కి మారితే ఆ విషయాన్ని వాట్సాప్‌ నెంబర్లకు చేరవేయొచ్చు. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ యూజర్లు కూడా  ఈ ఆప్షన్‌ని వాడుకోవచ్చు. వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోని ఎకౌంట్‌ మెనూలోకి వెళ్తే ‘ఛేంజ్‌ నెంబర్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. సెలెక్ట్‌ చేసి పాత, కొత్త నెంబర్లను ఎంటర్‌ చేసి అందరికీ అప్‌డేట్‌ చేరేలా చేయవచ్చు. కొందరికి మాత్రమే చెప్పేందుకు ‘కస్టమ్‌’ మెనూ ద్వారా కావాల్సిన కాంటాక్ట్‌లను మాత్రమే సెలెక్ట్‌ చేసుకోవచ్చు.