బాంబులకు భయపడని ధీర వనిత - MicTv.in - Telugu News
mictv telugu

బాంబులకు భయపడని ధీర వనిత

November 2, 2017

రష్యాలో ఓ మహిళ బాంబులకు బెదరకుండా, ధైర్యంగా వాటిమీదనుంచి  నడుచుకుంటూ వెళ్లింది. రష్యాకు చెందిన ఓ ఆయుధాల కంపెనీ  మిలటరీ అవసరాలకోసం బాంబులను తట్టుకునే సూట్‌ను తయారు చేసింది.

దాని పనితీరును పరిక్షించేందుకు, ఓ మహిళకు ఆ సూట్ వేసి బాంబులు పెట్టిన ప్రదేశంలో నడిపించారు. ఓ వైపు బాంబులు పేలుతూనే ఉన్నాయి, పెద్ద పెద్ద శబ్ధం వస్తూనే ఉంది. ఆ మహిళ వాటికేమీ భయపడకుండా ముందుకు సాగింది. ఈవీడియో ఇప్పుడు యూట్యూబ్ లో వైరలవుతోంది.