దోమలపై యుద్ధానికి డ్రోన్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

దోమలపై యుద్ధానికి డ్రోన్లు..

April 23, 2018

దోమల సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. వీటిపై పోరాడ్డానికి ఓ కొత్త పద్ధతిని కనిపెట్టారు. దోమల వల్ల వ్యాపించే  జికా, మలేరియా వంటి వ్యాధులను నివారించేందుకు అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఏఈఏ), దాని అనుబంధ భాగస్వాములు డ్రోన్ల  సాయం తీసుకున్నారు. వీటి ద్వారా వంధ్యత్వ దోమలను విడిచిపెట్టి విజయం సాధించారు.ఐఏఈఏ, ఐరాసకు చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో), స్వచ్ఛంద సంస్థ వుయ్‌ రోబోటిక్స్‌లు గతేడాది ఈ మేరకు వంధ్య క్రిమి సాంకేతికత (సిట్‌) ఆధారితంగా డ్రోన్ల నుంచి దోమలను విడిచిపెట్టే విధానాన్ని రూపొందించాయి. ఈ వ్యవస్థను గత నెల్లో బ్రెజిల్‌లో విజయవంతంగా పరీక్షించారు. డ్రోన్లలో ఉంచే మగ దోమలకు రేడియేషన్‌ను ఉపయోగించి పునరుత్పత్తి సామర్థ్యాన్ని దూరంచేసి వాతావరణంలో విడిచిపెడతారు. అనంతరం ఈ దోమలు ఆడ దోమలతో కలిసినప్పటికీ సంతానం కలగదు. ఫలితంగా దోమలు తగ్గి, వ్యాధి నియంత్రణలోకి వస్తుంది.