నారాయణ కాలేజీకి 10లక్షల జరిమానా - MicTv.in - Telugu News
mictv telugu

నారాయణ కాలేజీకి 10లక్షల జరిమానా

November 2, 2017

విద్యార్థుల ఆత్మహత్యలు’ అని ఈమధ్య ప్రతిరోజు ఓ వార్త చూస్తున్నాం. తల్లిదండ్రులు తిట్టారనో, లెక్చరర్లు కొట్టారనో, లేక చదువు ఒత్తిడివల్లో ఏదో ఓ కారణం చేత, చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు పోగొట్టుకున్నారు.

ఇటీవల కడపలోని నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి ఆత్మహత్యపై విచారణ చేపట్టిన అధికారులు, విద్యార్ధి ఆత్మహత్యకు యాజమాన్యం, కళాశాల సిబ్బందే కారణమని అని తేలడంతో, నారాయణ కాలేజీపై రూ.10 లక్షల జరిమానా విధించారు. ఇకమీదట విద్యార్ధులపై ఒత్తిడి పెంచితే, అటువంటి  కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు చేశారు.