Telugu people lost life in USA Massachusetts road accident
mictv telugu

అమెరికాలో ఘోరం.. ముగ్గురు తెలుగువాళ్లు మృతి

October 26, 2022

Telugu people lost life in USA Massachusetts road accident

ఎన్నో కలలతో విదేశానికి వెళ్లిన ముగ్గురు తెలుగువారు అర్ధంతరంగా తనువు చాలించారు. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ వాళ్లు, ఒక ఏపీ వ్యక్తి అసువులు బాశారు. మసాచుసెట్స్‌లోని షెఫ్‌ఫీల్డ్‌లోని 7వ రూట్లో బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలో మినీ వ్యాన్, పికప్ ట్రక్కు బలంగా ఢీకొన్నాయి. ముగ్గురు చనిపోగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

మినీవ్యాన్‌లో డ్రైవర్‌తో సహా ఏడుగురు ఉన్నారు. మృతులను తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకకు చెందిన పాటంశెట్టి సాయి నరసింహ, వరంగల్ కు చెందిన పావని, హైదరాబాద్ కు చెందిన ప్రేమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. సాయి నరసింహ కనెక్టికట్‌ ఎంఎస్ చదువుతున్నాడు. ఆయన తండ్రి నర్సరీ రైతు. క్షతగాత్రులు దగ్గర్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అక్కడి పోలీసులు బాధిత కుటుంబాలకు వెల్లడించారు.