ఐపీఎల్-2023కి సంబంధించిన మినీ వేలం ముగిసింది. ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కోట్ల వర్షం కురిపించాయి. వేలంలో ఆల్ రౌండర్స్ జాక్ పాట్ కొట్టేశారు. బంతితో పాటు బ్యాట్‌తో మెరుపులు మెరిపించగల సామ్ కరన్ ను రూ.18.5 కోట్లు పెట్టి పంజాబ్ కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్రీన్ కోసం ముంబాయి రూ.17.5 కోట్లకు సొంతం చేసుకుంది. స్టోక్స్ ను రూ.16.25 కోట్లు పెట్టి చెన్నై దక్కించుకోగా..నికోలస్ పూరన్ కోసం లక్నో 16 కోట్లు పెట్టింది. ఇటీవల బ్యాటింగ్‌లో అదరగొడుతున్న ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ కు జాక్ పాట్ తగలింది. అతడిని హైదరాబాద్ రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది. వేలంలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు క్రికెటర్లు అమ్ముడయ్యారు.
కేఎస్ భరత్ @ 1.2 కోట్లు(గుజరాత్)
కొంతకాలంగా దేశవాళీ, భారత్ -ఎ తరపున రాణిస్తున్న ఆంధ్ర వికెట్ కీపర్ కేఎస్ భరత్ ను గుజరాత్ రూ.1.2 కోట్లకు సొంతం చేసుకుంది. గతంలో బెంగళూరుకు ఆడిన భరత్.. పలు మ్యాచ్‌ల్లో మెరిశాడు. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ సీజన్లలో అత్యధిక ధర పలికిన తొలి ఆంధ్ర క్రికెటర్‌గా భరత్ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ టూర్లో భారత్ టెస్టు జట్టులో భరత్ ఉన్నాడు.
ధోని జట్టులో గుంటూరు కుర్రోడు..
గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ ను చెన్నై రూ.20 లక్షలకు దక్కించుకుంది. అండర్-19 ప్రపంచ్ కప్ లో భారత్ తరఫున షేక్ రషీద్ కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు.తన బ్యాట్ జట్టుకి అవసరమైన విలువైన పరుగులు రాబట్టి ఐపీఎల్ లో సంపాదించాడు. ఏకంగా ధోని జట్టులో ప్లేస్ రావడం షేక్ రషీద్ ఆనంద వ్యక్తం చేస్తున్నాడు.
నితీష్ కుమార్ @20 లక్షలు
విశాఖపట్నానికి చెందిన నితీష్ కుమార్‌ని హైదరాబాద్ కొనుగోలు చేసింది. రూ.20 లక్షలకు అతడిని సొంతం చేసుకుంది. ఇటీవల జరిగిన దేశవాళీ టోర్నీలో నితీష్ కుమార్ రాణించాడు. స్పిన్ బౌలింగ్‌తో పాటు బ్యాట్ తో రాణించే హైదరాబాదీ భగత్ వర్మను చెన్నై కొనుగోలు చేసింది. కనీస ధర రూ.20 లక్షలకే కైవసం చేసుకుంది. గతంలో జరిగిన వేలంలోనూ అతడిని చెన్నైకొనుగోలు చేసినా అతడికి తుది జట్టులో అవకాశం దక్కలేదు..