RRR అభిమానులకు కొండంత నిరాశ.. విడుదల ఎప్పుడంటే! - MicTv.in - Telugu News
mictv telugu

RRR అభిమానులకు కొండంత నిరాశ.. విడుదల ఎప్పుడంటే!

February 5, 2020

టాలీవుడ్ పరిశ్రమలో అందరూ ఆసక్తికరంగా చెప్పుకుంటున్న ముచ్చట ప్రస్తుతం ఒకే ఒకటి. దర్శక దిగ్గజం రాజమౌళి తీస్తున్న RRR చిత్రం ఎలా ఉండబోతోంది? బాహుబలి రికార్డులను షేక్ చేస్తుందా? రాజమౌళి ఈ చిత్రంలో కొమ్రం భీమ్, అల్లూరి సీతారామరాజుల చరిత్రను సైరాలో మాదిరే కొంత కల్పనతో చూపుతాడా? భిన్నంగా చూపుతాడా? గ్రాఫిక్స్ ఎలా ఉంటాయి? ఇంకా ఎవరెవరు సూపర్ స్టార్లు ఉంటారు? ఒకటి కాదు బోలెడన్ని ప్రశ్నలు చర్చలు. వీటికి ఈ ఏడాది జూలైలో చిత్రం విడుదలతో సమాధానాలు లభిస్తాయని ఆశిస్తున్నారు. 

అయితే ఉత్కంఠను మరింత పెంచుతూ చిత్రం విడుదలను నెల తక్కువగా ఏడాది పాటు వాయిదా వేశారు. ట్రిపుల్ ఆర్ వచ్చే ఏడాది.. అంటే 2021 జనవరి 8న విడుదల చేస్తున్నట్లు మూవీ టీం తెలిపింది. రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవగణ్ తదితర దిగ్గజాలు నటిస్తున్న ఈ చిత్రం 80 శాతంకు పైగా పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే మరింత క్వాలిటీ కోసం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం పడుతుంది కనుక విడుదల తేదీని వాయిదా వేసినట్లు సమాచారం. విడుదల ఏడాదిపాటు వాయిదాపడ్డంతో ఆ లోటును తీర్చడానికి ప్రతి అప్‌డేట్‌ను తాము ప్రేక్షకులతో పంచుకుంటామని మూవీ టీఎం తెలిపింది.