సింగపూర్‌లో తెలుగు స్పైడర్ మ్యాన్‌కు భారీ జరిమానా - MicTv.in - Telugu News
mictv telugu

సింగపూర్‌లో తెలుగు స్పైడర్ మ్యాన్‌కు భారీ జరిమానా

June 1, 2022

సింగపూర్‌లో తెలుగు స్పైడర్ మ్యాన్‌కు అక్కడి న్యాయస్థానం భారీ జరిమానాను విధించింది. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు స్థానిక కోర్టు 4,000 సింగపూర్ డాలర్ల ( అంటే రూ.2.24 లక్షలు) జరిమానా విధించింది. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా భారతదేశానికి చెందిన రోహన కృష్ణ అనే వ్యక్తి స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్ వేసుకున్నందుకు, ఐదుగురికి మించి ఎక్కువ మంది ఒకే చోట గుమికూడినందుకు కేసులో ఆయనను దోషిగా తేల్చుతూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

సింగపూర్‌లో కోవిడ్ రూల్స్ అమల్లో ఉన్నా సమయంలో.. క్లార్క్ క్వే వద్ద తొమ్మిది మంది బృందం ఓ పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో రోహనకృష్ణ ఉన్నాడు. ఐదుగురు కంటే ఎక్కువ మంది ఒక చోట ఉండకూడదని అక్కడి నిబంధన. ఆ నిబంధనను రోహన కృష్ణ అతిక్రమిస్తూ, స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్ ధరించి, ఎక్కువ మంది జన సందోహం మధ్య గడుపాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు తన యూట్యూబ్ చానల్‌లో పెట్టుకున్నాడు. అవి కాస్త వైరల్ కావడంతో సింగపూర్ ప్రభుత్వం రోహన కృష్ణ ఆగ్రహిస్తూ, కొవిడ్ 19 భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించినట్టు కేసు నమోదు చేసింది. దాంతో విచారణ జరిపిన స్థానిక కోర్టు 4,000 సింగపూర్ డాలర్ల ( అంటే రూ.2.24 లక్షలు) విధించింది.