SS రాజమౌళి సెన్సేషన్ ఆర్ఆర్ఆర్ మూవీ జపనీస్ బాక్సాఫీస్ దెగ్గర తుఫాను సృష్టిస్తుంది. జపాన్ కరెన్సీలో 350 మిలియన్ యాన్ ల మైలురాయిని అత్యంత వేగంగా దాటిన భారతీయ చిత్రంగా నిలిచింది ఆర్ఆర్ఆర్. భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఆర్ఆర్ఆర్ భారత కరెన్సీ పరంగా జపాన్లో 17 కోట్ల రికార్డుని చేరుకుంది. అంతేకాదు జపాన్లో బాహుబలి 2 కలెక్షన్లను ఆర్ఆర్ఆర్ అధిగమించి రాజమౌళి తన రికార్డును తానే అధిగమించాడు. ఇక రజినీకాంత్ ముత్తు తరువాత జపాన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లని కొల్లగొట్టిన రెండవ భారతీయ చిత్రమిది. ముత్తు సినిమా జపాన్ లో 400 మిలియన్ యాన్ లు సాధించగా ఆర్.ఆర్.ఆర్ దూకుడు చూస్తుంటే ఈ ఆల్ టైం రికార్డ్ ని అతి త్వరలోనే బ్రేక్ చేసేలా ఉంది.
‘Gaalloki Paper lu egaresthe Screen Kanpinchakudadu.’
That's the discussion every fandom has before their fav hero’s film release.But who imagined that it would happen for @tarak9999& @alwaysramcharan’s film in Japan?🤩
The love our stars are getting for RRR is UNIMAGINABLE!❤️ https://t.co/amdCACOGbA— RRR Movie (@RRRMovie) November 27, 2022
ఇక ఇప్పటికే జపాన్ అభిమానులు కొద్దిరోజుల క్రితం సినిమా చూసేందుకు 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఆర్ఆర్ఆర్ థియేటర్ కి వచ్చారు. ఆర్ఆర్ఆర్ ఆడుతున్న జపాన్ థియేటర్లలో తెలుగు రాష్ట్రాల వాతావరణం కనపడుతుంది. అక్కడ థియేటర్ లో ప్రస్తుత పరిస్థితిని ఒక ఫ్యాన్ షేర్ చేయగా దాన్ని ఆర్.ఆర్.ఆర్ మూవీ టీం రీ ట్వీట్ చేసింది. ఆర్.ఆర్.ఆర్ ఆడుతున్న జపాన్ థియేటర్ లో స్క్రీన్ కూడా కనిపించనంతగా కాగితాలు విసిరేశారు. ఆ పిక్ చూసి ఇదేదో ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని థియేటర్ అనిపించేలా ఉంది. జపాన్ లో ఆర్.ఆర్.ఆర్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఈ ఒక్క ఫోటోతో చెప్పొచ్చు. తెలుగు ఫ్యాన్స్ మాదిరి స్క్రీన్లపై కాగితాలు విసిరి తమ ఉత్సాహాన్ని, ప్రేమను ప్రదర్శిస్తున్నారు జపాన్ ఫ్యాన్స్.