'ఆచార్య'కు తెలుగు రాష్ట్రాలు గుడ్‌న్యూస్.. ఏకంగా రూ.50 - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆచార్య’కు తెలుగు రాష్ట్రాలు గుడ్‌న్యూస్.. ఏకంగా రూ.50

April 26, 2022

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రాంచరణ్ కలయికలో దర్శకుడు కొరటాల శివ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాలో చిరంజీవి మెయిన్ హీరోగా, కీలక పాత్రలో రాంచరణ్ నటించారు. ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 29న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ‘ఆచార్య’ సినిమాకు గుడ్ న్యూస్ చెప్పారు. టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవలే తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా ‘ఆచార్య’ సినిమాకి రేట్లు పెంచుకునేందుకు వీలుగా అనుమతిని ఇచ్చింది. ఈ చిత్రాన్ని హీరోల రెమ్యునరేషన్స్ మినహా సూపర్ హై బడ్జెట్ క్యాటగిరీలో పది రోజులు పాటు 50 రూపాయల అదనపు ధరలు పెంచుకునేందుకు కొత్త జీవోలను విడుదల చేశారు. దీంతో ఆచార్య చిత్రబృందం కేసీఆర్‌కు, జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ వార్తతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అటూ ఏపీలో, ఇటు తెలంగాణ రాష్ట్రాలలో టికెట్స్ రేట్లు పెరగడంతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ళను రాబోడుతుందోనని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.