ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న హైదరాబాద్‌కు చెందిన సుంకర ప్రసాద్ నాయుడును అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు . సుంకర ప్రసాద్ నాయుడుతో పాటు 13మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక పిస్తోల్, 13 తూటాలు, స్కార్పియోతో పాటు రూ.6.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా తెలంగాణలో గత కొన్నేళ్లుగా హత్యలు, కిడ్నాప్ లు చేస్తోంది.
ఈనెల 20న గుంతకల్లుకు చెందిన ఆకుల వ్యాపారి వెంకటేశ్ కిడ్నాప్ కేసులో గుంతకల్లు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి సుంకర ప్రసాద్ నాయుడుని డోన్ సమీపంలోని ఓబుళాపురంపై మిట్ట వద్ద అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో గత కొన్నేళ్లుగా హత్యలు, కిడ్నాపులు, బలవంతపు వసూళ్లు, దొంగతనాలకు పాల్పడ్డారని వివరించారు. ప్రసాద్ నాయుడుపై రెండు రాష్ట్రాల్లో 11 కేసులు నమోదయ్యాయి. గత నెలలో గుంతకల్ లో స్వామిజీ ముత్యాల గంగరాజును ఈ ముఠా కిడ్నాప్ చేసింది. రూ.25లక్షలు ఈ ముఠా వసూలు చేసింది. స్వామిజీ ముత్యాల గంగరాజు పోలీసులను ఆశ్రయించారు. దీంతో నిందితులను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు.