ఖరగ్‌పూర్ ఐఐటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య  - Telugu News - Mic tv
mictv telugu

ఖరగ్‌పూర్ ఐఐటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య 

April 28, 2020

Telugu Student in Kharagpur IIT  

పశ్చిమ బెంగాల్‌లోని ఖరంగ్‌పూర్ ఐఐటీలో చదువుతున్న తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రీసెర్చ్ స్కాలర్ కొండలరావు (28) హాస్టల్ గదిలో ఉరివేసుకున్నాడు. ఈ ఘటనతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. తోటి విద్యార్ధులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి తలుపులు పగలగొట్టి పోస్టుమార్టం కోసం పంపించారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. 

విజయనగరం జిల్లాకు చెందిన కొండల్ రావు కొన్ని రోజులుగా ఐఐటీలో రిసెర్చ్ స్కాలర్‌గా ఉన్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 26న ఎవరూ లేని సమయంలో గదిలో ఉరివేసుకున్నాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు విజయనగరం ఎస్పీ అనుమతితో ఖరగ్ పూర్ కు బయలుదేరారు. బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకుంటానుకున్న కొడుకు లేకపోవడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా వర్సిటీలో చాలా మంది విద్యార్థులు లాక్‌డౌన్ కారణంగా తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు.  దీనికి గల కారణాలు ఇంకా తేలాల్సి ఉందని స్థానిక పోలీసులు చెబుతున్నారు.