ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థి మృతి

September 21, 2020

 ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థి ఆకస్మికంగా మరణించాడు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. వికారాబాద్ జిల్లాలో దారూర్ మండలంలో ఉన్న హ

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థి ఆకస్మికంగా మరణించాడు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. వికారాబాద్ జిల్లాలో దారూర్ మండలంలో ఉన్న హరిదాస్‌పల్లికి చెందిన హరిశివశంకర్ రెడ్డి ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాలోని సదరన్ క్రాస్ యూనివర్శిటీకి వెళ్లాడు. తోటి విద్యార్థులతో కలిసి ఫ్లాట్‌లో ఉంటూ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రోజున బాత్రూమ్‌కు వెళ్ళిన హరిశివశంకర్ అనుకోకుండా కుప్పకూలిపోయాడు.

ఇది గమనించిన అతడి రూమ్ మేట్స్ వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా హరిశివశంకర్ మృతిచెందాడు. ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో అతడి తల్లిదండ్రులు అయిన సాయిరెడ్డి, నాగేంద్రమ్మలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. హరిశివశంకర్ మరణవార్త తెలియడంతో హరిదాస్‌పల్లిలో విషాధచాయలు అమలుకున్నాయి. తమ బిడ్డ మృతదేహన్ని ఇండియాకు రప్పించడానికి తెలంగాణ ప్రభుత్వం సహాయం చేయాలని మృతుడి తల్లిదండ్రులు కోరుతున్నారు.