ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్ధులు.. ఆందోళనలో తల్లిదండ్రులు - MicTv.in - Telugu News
mictv telugu

ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్ధులు.. ఆందోళనలో తల్లిదండ్రులు

February 24, 2022

 

001

‘ఉక్రెయిన్‌లో ఉండిపోయిన మా పిల్లలను రక్షించండి’ అంటూ తల్లిదండ్రులు విదేశాంగ శాఖను వేడుకుంటున్నారు. దీంతో స్పందించిన విదేశాంగ శాఖ.. ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన సుమారు 350 మంది తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. భారత్ నుంచి ఉక్రెయిన్‌కు ఎయిర్ ఇండియా మాత్రమే విమానాలు న‌డుపుతోంది. అయితే, అక్క‌డ‌కు వెళ్లిన ఓ ఎయిర్ ఇండియా భార‌త్‌కు ఖాళీగానే తిరుగు ముఖం ప‌ట్టింది. ఈ నెల 26న భారత్ నుంచి మ‌రో ప్ర‌త్యేక విమానం వెళ్లాల్సి ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల నడుమ అది పంపించాలా లేదా అనే సందేహాంలో ఉన్నాం’ అని తెలిపింది. ఇప్ప‌టికే కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా లేఖ‌ రాసి, ఏపీ విద్యార్థుల‌ను ర‌ప్పించాల‌ని కోరారు.

మరోపక్క రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. దీంతో ఇప్ప‌టికే ఉక్రెయిన్ తన గ‌గ‌న‌త‌లాన్ని మూసేసింది. పర్యవసానంగా వేలాది మంది భారతీయ విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయారు. వీరిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా భారీగానే ఉన్నారు.