తెలంగాణలో తెలుగును తప్పనిసరిగా నేర్వాల్సిందే.. కేసీఆర్ ఆదేశాలు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో తెలుగును తప్పనిసరిగా నేర్వాల్సిందే.. కేసీఆర్ ఆదేశాలు

March 20, 2018

తెలుగు విద్యాబోధనలో తెలుగు భాషకు విశిష్ట స్థానం కల్పిస్తామని ప్రపంచ తెలుగు మహాసభల్లో హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆ దిశగా కీలక ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు భాషను తప్పనిసరి చేయాలని మంగళవారం అధికారులను ఆదేశించారు. 2018-19 విద్యా సంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు కూడా తెలుగును నేర్చుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. మొదటి దశలో పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలన్నారు.

తమిళనాడులో మాతృభాషలో బోధనా విధానాన్ని అధ్యయనం చేసిన అధికారులతో సీఎం మంగళవారం భేటీ అయ్యారు. తెలుగును తప్పనిసరి చేయాలని, దాన్ని ఒక సబ్జెక్టుగా బోధించేందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించానలి అధికారులను ఆదేశించారు. తెలుగు సిలబస్ రూపొందించాలని తెలుగు వర్సిటీ, సాహిత్య అకాడమీలను కోరిన సీఎం.. సిలబస్‌లో దేశభక్తి,  నైతిక విలువలకు ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లలోనే కాకుండా ప్రైవేట్ స్కూళ్లలో తెలుగున తప్పనిసరిగా బోధించాలని, వాటిలోనూ తెలుగు పండితులను నియమించుకునే చూడాలని అన్నారు. దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో చట్టాన్ని తీసుకొస్తామని వెల్లడించారు