30 ఏళ్లు స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని ఏలిన బ్యూటీ మీనా గురించి ప్రత్యేకంగా ఇంట్రో అవసరం లేదు. తమిళ అమ్మాయి అయినప్పటికీ తెలుగు తెరముందు సందడి చేసి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ బ్యూటీ . తాజాగా తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసిన మీనా ఓ సంచలన విషయాన్ని బయటపెట్టింది. అప్పట్లో తాను ఓ హీరోను ఇష్టపడ్డానని, కానీ అతనికి పెళ్లి కావడంతో చాలా అప్సెట్ అయ్యానని ఓ తమిళ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి బయటకు చెప్పింది మీనా. ఇంతకీ మీనా మనసును గెలిచిన ఆ హీరో ఎవరు..? అతడినే ఎందుకు మీనా ఇష్టపడిందో ఇప్పుడు చూద్దాం.
సౌత్ సినీ ఇండస్ట్రీలో తన నటనతో అందంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ మీనా. తెలుగులో మీనా నటించిన అన్ని సినిమాలు దాదాపు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మీనా తెరముందు కనిపిస్తే చాలు ఆమెను చూస్తూ మైమరిచిపోయేవారు చాలా మందే ఉన్నారు. మీనా ఇండస్ట్రీకి వచ్చి 40 సంవత్సరాలు అవుతోంది. బాల నటిగా తన కెరీర్‌ను స్టార్ట్ చేసిన మీనా నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుని 30 ఏళ్లు స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో తన క్రేజ్ ను కంటిన్యూ చేసింది. తమిళ తెలుగు చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలు కమల్ మాసన్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ , వెంకటేశ్, నాగార్జునలతో కలిసి స్క్రీన్ పంచుకుని ఇరదీసింది ఈ బ్యూటీ.
సుదీర్ఘకాలం ఇండస్ట్రీలో కొనసాగిన హీరోయిన్ గానూ మీనాకు మంచి రికార్డు ఉంది. 2009లో బెంగళూరుకు చెందిన బిజినెస్ మెన్ అయిన విద్యాసాగర్‌ను పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. మీనాకు ఒక పాప ఉంది. వీరి జీవితం సాఫీగా సాగుతుందనుకునే లోపో భర్త మరణం మీనాను కుంగదీసింది. గతేడాది మీనా భర్త మృతిచెందారు. ఇప్పుడిప్పుడే భర్తను కోలపోయిన బాధ నుంచి కోలుకుంటున్న మీనా సెకెండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో నటిస్తూ భర్త పోయిన బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది.
ఇదిలా ఉంటే మీనా రీసెంట్ గా ఓ తమిళ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పట్లో తాను ప్రేమించిన స్టార్ గురించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. పెళ్లికి ముందు తనకు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అంటే క్రష్ ఉండేదంటూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చింది. అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని అప్పట్లో తన తల్లితో చెప్పానని మీనా అన్నారు. హృతిక్ రోషన్ అంటే తనకు చాలా చాలా ఇష్టమని తనని లవ్ చేశానని తెలిపింది. అయితే హృతిక్ కి పెళ్లైందన్న విషయం తెలిసి నా గుండె పగిలిందని చెప్పుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇన్నాళ్లకు మీనా తన లవ్ స్టోర్ చెప్పడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఈ వీడియోను చూస్తున్నారు.