మేకప్ లేని యాంకర్ సుమను చూడండి..వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

మేకప్ లేని యాంకర్ సుమను చూడండి..వీడియో

January 24, 2020

suma

తెలుగు సినీరంగంలో యాంకర్ అనగానే టక్కున గుర్తొచ్చేపేరు సుమ. ఎన్నో సినిమా వేడుకలో వేదికపై తనదైన శైలిలో చమక్కులు వదిలే ఆమె మాటలకు తెలుగు రాష్ట్రాల్లో ఎందరో అభిమానులున్నారు. ఎన్నో తెలుగు సినిమాల ఆడియో ఫంక్షన్లకు ఆమె యాంకర్‌గా వ్యవహరించింది. 

సోషల్ మీడియాలోనూ సుమ చురుకుగా ఉండే ఆమె.. ‘సుమక్క’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్‌ను కూడా ప్రారంభించింది. యూట్యూబ్‌లో వివిధ రకాల వీడియోలు పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఓ వీడియో పోస్ట్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఏ మాత్రం మేకప్‌ వేసుకోకుండా ఆమె కనపడి పలు విషయాలు వెల్లడించింది. గత రాత్రి తాను ‘క్యాష్’ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నానని, ఆ మరుసటి రోజు తాను ఇలా ఉన్నానని ఆమె చెప్పింది. ఆ ప్రోగ్రాం సందర్భంగా ఫ్యాన్స్ తనకు ఇచ్చిన గిఫ్ట్స్ గురించి మాట్లాడింది. అభిమానుల కోసమైనా మేకప్ వేసుకొని కష్టపడి పనిచేయాలనిపిస్తుందని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న సుమ ఏమాత్రం మేకప్ లేకుండా బయటకి వచ్చిన ఆమె ధైర్యసాహసాలను అభిమానులు మెచ్చుకుంటున్నారు. గతంలో నటి కాజల్ కూడా ఏమాత్రం మేకప్ లేకుండా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది.