విజయ్ ట్రైలర్ ‘అదిరింది’ - MicTv.in - Telugu News
mictv telugu

విజయ్ ట్రైలర్ ‘అదిరింది’

October 26, 2017

వివాదస్పదంగా మారడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతున్న తమిళ మూవీ ‘మెర్సల్’ తెలుగు వెర్షన్ ‘అదిరింది’ అన్ని అడ్డంకులను దాటుకుని రేపు విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ బుధవారం దీని ట్రైలర్ ను విడుదల చేసింది. ఇందులో శక్తిమంతమైన డైలాగులు ఉన్నాయి. ‘కళ్లు లేకుండా బతకొచ్చు. కానీ పిల్ల లేకుండా ఎవ్వరూ బతకలేరు’, `తల్లి బిడ్డను కనడానికి పది నెలలు పట్టుద్ది. ఒకరు డిగ్రీ అందుకోవడానికిమూడేళ్లు పట్టుద్ది. కానీ ఒక నాయకుడు ఉదయించడానికి ఒక యుగమే పట్టుద్ది’  వంటి పంచ్‌లు అదిరాయి.  మూవీలో విజయ్ మూడు పాత్రల్లో నటించగా, కాజ‌ల్‌, నిత్యామీన‌న్‌, స‌మంత‌ల‌ జోడీ కట్టారు. ఈ  మూవీకి అట్లీ దర్శకత్వం వహించాడు.

178 కోట్లు

‘మెర్సెల్’ కలెక్షన్లు ఏమాత్రం తగ్గడం లేదు. విడుదలైన వారం రోజుల్లోనే 178 కోట్లు రాబట్టింది. ఒక్క తమిళనాడులోనే 87 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అమెరికాలో 9.4 కోట్ల గ్రాస్ వచ్చింది.