Telugu woman died in seattle road accident
mictv telugu

పోలీస్ వాహనం ఢీకొని అమెరికాలో తెలుగు యువతి మృతి

January 25, 2023

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఓ తెలుగమ్మాయి దురదృష్టవశాత్తూ ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. రోడ్డుపై నడుచుకుంటున్న వెళ్లున్న ఆమెను వేగంగా వచ్చిన పోలీస్ వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతూ మరణించింది. అమెరికాలోని సియాటిల్ నగరంలో ఈ ప్రమాదం జరిగింది. సౌత్ లేక్ యూనియన్‌లోని సియాటిల్ లో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఆమెను పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొన్నదని పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది.

జాహ్నవి సోమవారం రాత్రి 8 గంటల తర్వాత డెక్స్టర్ అవెన్యూ నార్త్, థామస్ స్ట్రీట్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా పోలీసుల వాహనం ఢీకొట్టింది. సీటెల్ ఫైర్ డిపార్ట్‌మెంట్ నుంచి మెడికో టీమ్ వచ్చే లోపు ఆమెను బతికించేందుకు అధికారులు సీపీఆర్ చేశారు. వైద్యులు సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత వారు ఆమె ప్రాణాలు రక్షించే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే జాహ్నవిని హార్బర్‌వ్యూ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది.

మృతి చెందిన యువతిని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి కందులగా గుర్తించిన పోలీసులు.. ప్రమాదానికి కారణమైన అధికారి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ట్రాఫిక్ కొలిజన్ ఇన్వెస్టిగేషన్ స్క్వాడ్ నుండి డిటెక్టివ్ లు ఈ సంఘటనను విచారణ జరుపుతున్నారు.

అయితే, ప్రమాదానికి కారణమైన అధికారి వివరాలను పోలీసులు వెల్లడించ లేదు. ట్రాఫిక్ కొలిజన్ ఇన్వెస్టిగేషన్ స్క్వాడ్ డిటెక్టివ్స్ ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నారు. కన్నవారిని, పుట్టిన గడ్డను వదిలేసి విదేశాల్లో మంచి భవిష్యత్ కోసం ప్రయత్నిస్తున్న ఎంతో మంది భారతీయులు ఇలాంటి మరణాల బారిన పడడం చాలా బాధాకరం.