టిక్‌టాక్ ఫన్.. పడిపోయా పాటలో నిజంగానే పడిపోయింది.. - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్ ఫన్.. పడిపోయా పాటలో నిజంగానే పడిపోయింది..

May 16, 2019

పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అన్నీ వయసుల వారిని విపరీతంగా ఆకర్షిస్తున్న ఒకే ఒక్క యాప్ టిక్‌టాక్ అని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఈ యాప్ వల్ల చాలామంది తమ టాలెంటును బహిర్గతం చేసుకుంటున్నారు. ఎక్కడ టైం దొరికినా ఫోన్ ఆన్ చేయడం వీడియో చేయడం ఇదే పనైపోయింది కొందరికి. చూసినవాళ్లకు కూడా వాళ్లు టిక్‌టాక్ చేసుకుంటున్నారులే అనే స్ఫురణ వచ్చేసింది. ఈ క్రమంలో ఓ యువతి టిక్‌టాక్ చేద్దామని ఫోన్ ఆన్ చేసి మెట్ల మీద పెట్టింది.  ‘డీకే బోస్‌’ సినిమాలోని పడిపోయా పడిపోయా అనే పాటను ఎంచుకుని డాన్స్ చేయడానికి సిద్ధమైంది. మెట్లపైకి నడిచొచ్చి డాన్స్ చేస్తూ మళ్లీ కిందికి దిగాలనుకుంది.

కానీ అకస్మాత్తుగా కాలుజారి పడిపోయింది. పాటలోని పల్లవి మాదిరి ఆమె నిజంగానే పడిపోవడంతో ఆమె టిక్‌టాక్ ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారు. చాలా మంది ఆ వీడియోను షేర్లు చేస్తున్నారు. టిక్‌టాక్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త తల్లీ అని కొందరు కామెంట్లలో సలహాలు ఇస్తున్నారు. పడిపోయా పడిపోయా అంటూ నిజంగానే పడిపోయావా అంటూ మరికొందరు వెటకరిస్తున్నారు.