టీం ఇండియా మహిళల క్రికెట్ జట్టులో తెలుగు అమ్మాయి చోటు దక్కించుకుంది. ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అంజలి శర్వాణి భారత మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికైంది. త్వరలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌కు అంజలికి స్థానం దక్కింది. డిసెంబర్ 9 నుంచి 20 వరకు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కొనసాగనుంది.
ఇరు జట్ల మధ్య 5 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అంజలి శర్వాణి టీం ఇండియాకు ఎంపిక కావడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదోని ప్రాంతంలో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అంజలి తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడు కాగా.. తల్లి సాధారణ గృహిణి. క్రికెట్ పై ఆమె ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. దీంతో చదువుకుంటూనే క్రికెట్ వైపు అడుగులు వేసింది అంజలి. జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో విశేషంగా రాణించి భారత్ జట్టులో చోటు సంపాందించింది. పాతికేళ్ల అంజలి తన ఎడమచేతివాటం మీడియం పేస్ బౌలింగ్‌తో బ్యాటర్లకు చుక్కుల చూపించగలదు. ఇటీవల జరిగిన బీసీసీఐ సీనియర్ మహిళల టీ20 టోర్నీలో రైల్వేస్ జట్టు తరఫున అంజలి శర్వాణి సత్తా చాటింది.