దళితుడిగా పుట్టి అవధానిగా ఎదిగిన ఆశావాది కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

దళితుడిగా పుట్టి అవధానిగా ఎదిగిన ఆశావాది కన్నుమూత

February 18, 2022

news01

ప్రముఖ రచయిత, అవధాని పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావు గుండెపోటుతో కన్నుమూశారు. 77 ఏళ్ల ప్రకాశరావు అనంతపురం జిల్లా పెనుకొండలోని స్వగృహంలో గురువారం తుదిశ్వాస విడిచారు. దళిత కుటుంబంలో పుట్టి పట్టుదలతో ఉన్నతవిద్య అభ్యసించిన ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా.

ప్రకాశరావు శింగనమల మండలం కొరివిపల్లోలో 1944లో జన్మించారు. పుష్పాంజలి, అంతరంగ తరంగాలు, మెరుపుతీగలు, చెల్లపిళ్లరాయ చరిత్రము, ఆర్కెస్ట్రా, విద్యా విభూషణ, ఘోషయాత్ర నాటకం, నారాయణ శతకము, శ్రీ రాప్తాటి పరిచయ పారిజాతము తదితర 50కిపైగా పుస్తకాలు రాశారు. పెనుగొండ, గుంతకల్లు తదితర పట్టణాల్లో లెక్చరర్‌గా పనిచేసిన ప్రకాశరావు 2002లో పెనుగొండ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా రిటైరయ్యారు. ప్రముఖ అవధాని సీవీ సుబ్బన్న వద్ద శిష్యరికం చేసిన ప్రకాశరావు 1963లో తన 19వయేట మొదటి అవధానం చేశాడు. దేశవ్యాప్తంగా 171కి పైగా అవధానాలు చేశారు.