83 ఏళ్ల తాతకు..30 ఏళ్ల యువతితో లగ్గం! - MicTv.in - Telugu News
mictv telugu

83 ఏళ్ల తాతకు..30 ఏళ్ల యువతితో లగ్గం!

February 21, 2018

వారసుడు లేకపోతే ఆస్తి ఏమైపోతుందో అని తాత బెంగపడ్డాడు. అందుకే 83 ఏళ్ల వయసులో తలకు బాసింగం కట్టాడు. ముప్పై ఏండ్ల వధువు  ఓ పేదింటి యువతి. ‘తాత ఎన్కపొంటి చాలా ఆస్తి ఉంది, మొగుడు ముసలోడు అయితే ఏంటి.. బిడ్డ అష్టైశ్వర్యాలు అనుభవిస్తుంది’ అనుకున్నారు పిల్ల తల్లిదండ్రులు, ఇంకే పెళ్లి బాజాలు మోగాయి. రాజస్థాన్‌కి చెందిన షుఖ్ రాం భైరవ(83)కు భార్య, కొడుకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

అయితే 20 ఏళ్ల క్రితమే చేతికందిన కొడుకు చనిపోయాడు. కూతుర్లు అత్తారింటికి వెళ్లారు. మరి సంపాదించిన ఆస్తి ఎటూ కాకుండా పోతుందని దిగులు పడ్డాడు. అందుకే భార్య సహకారంతో మళ్లీ పెళ్లి పీటలు ఎక్కాడు. తాత మొదటి భార్య అవ్వే.. దగ్గరుండి   బాసింగం కట్టి మరీ వారసుడికోసం తాతను పెళ్లి పీటలు ఎక్కించింది. ఇరు కుటుంబాల చుట్టాలు హాజరై అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు.