తమిళనాడు గుడిలో గుంటూరు మహిళ మృతి - MicTv.in - Telugu News
mictv telugu

తమిళనాడు గుడిలో గుంటూరు మహిళ మృతి

July 18, 2019

Temple stamped in tamil nadu, gutur woman passed away.......

 తమిళనాడులోని కాంచీపురం అత్తివరదరాజస్వామి ఉత్సవాళ్లో అపశ్రుతి చోటు చేసుకుంది. స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో నిల్చున్న భక్తుల మధ్య తొక్కిసలాట జరగడంతో గుంటూరు చెందిన ఓ మహిళ సహా నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు ఉన్నారు. ఉత్సవాల్లో ఏర్పాట్లు సరిగా చేయకపోవడం వల్లే ఘటన జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులను కాంచిపురంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాంచీపురం వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో అత్తివరధర్‌ ఉత్సవాలు జరుగుతున్నాయి. 40 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఉత్సవాలు ఆగస్టు 17 వరకు కొనసాగుతాయి.  ఆలయ ప్రాంగణంలోని అనంత సరస్సు (పుష్కరిణి)లోని నాలుగు కాళ్ల మంటపం నుంచి 40 ఏళ్లకు ఒకసారి అత్తివరధర్‌ విగ్రహాన్ని బయటకు తీసి పూజలు చేస్తారు.