దేవాలయ దర్శనం.. వివాదంలో మోదీ తలపాగా - Telugu News - Mic tv
mictv telugu

దేవాలయ దర్శనం.. వివాదంలో మోదీ తలపాగా

June 14, 2022

ప్రధాని మోదీ పెట్టుకోనున్న తలపాగాపై వివాదం చెలరేగింది. ఆయన త్వరలో మహారాష్ట్రలోని పుణెలో సంత్ తుకారాం మహారాజ్ దేవాలయాన్ని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ధరించడానికి దేహు టెంపుల్ వారు ఓ ప్రత్యేక్ డిజైన్ కలిగిన తలపాగాను తయారు చేయించారు. తలపాగాపై తుకారాం అభంగాలోని కొన్ని పదాలను ముద్రించగా వాటిపై వివాదం నెలకొంది. పదాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాటిని మార్చాలంటూ దేహు సంస్థాన్ డిమాండ్ చేసింది. తలపాగాపై ‘మంచి ప్రవర్తన ఉన్న వారికి మంచే జరుగుతుంది. చెడు తలంపులు ఉన్నవారికి చెడు జరుగుతుంది’అంటూ అర్ధం వచ్చేలా ఉంది. దీనిని మార్చాలని డిమాండ్ రావడంతో వాటిని మార్చేసి తిరిగి డిజైన్ చేశారు. కాగా, మోదీ ఈ పర్యటనలో 17వ శతాబ్దానికి చెందిన సంత్ తుకారాం మహారాజ్ పేరిట ఉన్న ఆలయాన్ని ప్రారంభించనున్నారు. దాంతో పాటు ముంబై సమాచార్ పత్రక యెక్క ద్విశతాబ్ది మహోత్సవ్ వేడుకల్లో పాల్గొననున్నారు.