తెలుగు కొత్త సంవత్సరం.. బోసిపోయిన ఆలయాలు - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు కొత్త సంవత్సరం.. బోసిపోయిన ఆలయాలు

March 25, 2020

Festival.

ఉగాది అంటే తెలుగు వారికి ఎంతో ప్రాముఖ్యమైన పండగ. కొత్త సంవత్సరం నేటి నుంచి ప్రారంభంకానుండటంతో ప్రజలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఇంట్లో పిండి వంటలతో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కానీ ఈసారి ఉగాది మాత్రం అలా కాదు. పండగపూట ఇంట్లో కరోనా కల్లోలం కారణంగా ఆలయాలన్నీ బోసిపోయాయి. కేవలం అర్చకులు తప్పు ఎవరూ ఏ ఆలయంలో కనిపించడం లేదు. 

సాధారణంగా పండగంటేనే దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి.ఇక ఉగాది అంటే చెప్పాల్సిన పనిలేదు. కానీ శ్రీ శార్వరీ నామ సంవత్సరం సందర్భంగా ఆలయాలు భక్తులు లేక బోసిపోయాయి. ఎక్కువ మంది చేరితో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రభుత్వాలు హెచ్చరించడంతో ఆలయాలకు భక్తులను అనుమతించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను ప్రకటించడంతో అన్ని దేవాలయాల్లోనూ ఏకాంత పూజలే జరుగుతున్నాయి.