చంద్రబాబు ధర్మపోరాట దీక్ష ఖర్చు రూ.10 కోట్లా?...హైకోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రబాబు ధర్మపోరాట దీక్ష ఖర్చు రూ.10 కోట్లా?…హైకోర్టు

October 25, 2019

chandrababu .

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను నేరవేర్చాలని కోరుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 11న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వేదికగా దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ధర్మపోరాట దీక్ష పేరుతో చేసిన ఈ దీక్ష కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.10 కోట్ల ఖర్చుచేసినట్టు ఓ జీవో ద్వారా వెలుగులోకి వచ్చింది. 

ఒక్క రోజు దీక్ష ఖరీదు రూ.10 కోట్లా? అని అప్పట్లో విమర్శలు వచ్చాయి. దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ‘ఏ నిబంధనల ప్రకారం అంత సొమ్ము విడుదల చేశారు? ఆ అధికారి ఎవరు?’ అని ప్రశ్నించింది. ఇంత ప్రజాధనం ఎలా ఖర్చు చేశారని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను నవంబరు 21కి వాయిదా వేసింది.