వికారాబాద్‌లో పదిరోజుల స్వచ్చంధ లాక్‌డౌన్! - MicTv.in - Telugu News
mictv telugu

వికారాబాద్‌లో పదిరోజుల స్వచ్చంధ లాక్‌డౌన్!

July 14, 2020

Ten days lock down in vikarabad

కేంద్రప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ పూర్తైనప్పటినుంచి దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. దీంతో కేసులు పెరుగుతున్న నగరాలు, పట్టణాల్లో అక్కడి అధికారులు మళ్లీ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. ఇప్పటికే బెంగళూరు, పూణే అధికారులు లాక్ డౌన్ ప్రకటించారు. బీహార్ ప్రభుత్వం కూడా లాక్ డౌన్ విధించడానికి చర్చలు జరుపుతోంది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా పది రోజుల పాటు లాక్ డౌన్ విధించారు.

ఈ క్రమంలో వికారాబాద్‌లోని వ్యాపారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వికారాబాద్‌లో పది రోజుల పాటు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తామని ప్రకటించారు. కరోనా కేసులు ఎక్కువ అవుతున్నందున.. పది రోజుల పాటు పట్టణంలోని అన్ని షాపులను మూసివేస్తున్నట్లు వికారాబాద్ పట్టణ వాణిజ్య వ్యాపార సంఘాల నాయకులు తెలిపారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.