సాహో ఎఫెక్ట్.. ఒకే రోజు పది సినిమాలు విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

సాహో ఎఫెక్ట్.. ఒకే రోజు పది సినిమాలు విడుదల

August 21, 2019

Ten movies releasing same day in tollywood

బాహుబలి ప్రభాస్ నటించిన తాజా చిత్రం సాహో ఆగస్ట్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నాని నటిస్తున్న గ్యాంగ్ లీడర్ సహా మరికొన్ని సినిమాల విడుదల వాయిదా పడింది. గ్యాంగ్ లీడర్ సినిమా ఆగష్టు 30న విడుదల కావాల్సివుంది. కానీ సాహి అదేరోజున విడుదల కాబోతుండడంతో గ్యాంగ్ లీడర్ సినిమాను సెప్టెంబర్ 13కు మార్చారు. అలాగే ‘సాహో’ విడుదల అయిన పక్షం రోజుల వరకు మరో సినిమా విడుదలయ్యే అవకాశం లేదు. దీంతో చిన్న సినిమాలు అన్నీ ఆగష్టు 23పై కన్నేశాయి. ఆ ఒక్కరోజే మొత్తం పది సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుండడం ఇందుకు నిదర్శనం. 

తమిళంలో విజయం సాధించిన ‘కానా’ సినిమాను తెలుగులో ‘కౌసల్యా కృష్ణమూర్తి’ పేరుతో రీమేక్ చేసి విడుదల చేస్తున్నారు. ఆగష్టు 23న విడుదల కాబోతున్న పది సినిమాల్లో ఈ ఒక్క సినిమానే తన ప్రత్యేకత చాటుతోంది. ప్రేక్షకుల్లో ఈ సినిమాపైనే కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. వీటితో పాటు బాయ్, నేనే కేడీ నెం 1, ఉండిపోరాదే, నివాసి, హవా, జిందా గ్యాంగ్‌, నీతోనే హాయ్‌ హాయ్‌, కనులు కనులు దోచేనే, ఏదైనా జరగచ్చు లాంటి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఆగష్టు 23 తేదీ దాటిపోతే 30న సాహో సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్, అక్టోబర్ 2న సైరా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండడంతో తమ సినిమాలను విడుదల చేసుకునే అవకాశం ఉండదని భావించిన చిన్న సినిమాల నిర్మాతలు ఒకేసారి ఆగష్టు 23న ఈ సినిమాలను విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు.