అమెరికాలో ఒక్కరోజే 10000 కరోనా కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో ఒక్కరోజే 10000 కరోనా కేసులు

March 25, 2020

carona...

కరోనా వైరస్ మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తోంది. నిన్న ఒక్కరోజే అమెరికాలో 10 వేల కరోనా కేసులు నమ్మొదయ్యాయి. దీంతో అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 54 వేలకు చేరింది. మంగళవారం ఒక్కరోజే కరోనా కారణంగా 150 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు అక్కడ వైరస్ బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 775కు చేరింది. 

ఒక్క న్యూయార్క్‌ రాష్ట్రంలోనే మంగళవారం 53 మంది మరణించడం ఆందోళనకు గురిచేస్తుంది. న్యూజెర్సీ, మిషిగాన్‌, కాలిఫోర్నియా, ఇల్లినాయిస్‌, ఫ్లోరిడా రాష్ట్రాల్లో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంది. వాషింగ్టన్‌లో మాత్రం కొత్త కేసులు నమోదు కావడం లేదు. కరోనా వైరస్ ప్రభావం ఈస్టర్‌ పర్వదినం ఏప్రిల్‌ 12 నాటికి తగ్గిపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, కరోనాను కట్టడి చేయడానికి ప్రజలు సహకరించాలని ట్రంప్ కోరాడు. సోషల్ డిస్టన్స్ పాటించాలన్నాడు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. కరోనా నుంచి బయటపడడానికి రెండు ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి త్వరలో కాంగ్రెస్‌ ఆమోదిస్తుందన్నారు.